బీజేపీ నేతృత్వంలో హంగ్ ప్రభుత్వం వస్తుంది: ధర్మపురి అరవింద్

రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో హంగ్ ప్రభుత్వం వస్తుందంటూ బీజేపీ ఎంపీ,  కోరుట్ల అభ్యర్థి ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కేంద్ర నాయకత్వం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కంకణం కట్టుకుందని చెప్పారు. ఆదివారం(నవంబర్ 5) జగిత్యాల జిల్లా  మెట్ పల్లిలో జరిగిన బీజేపీ బూత్ లేవల్ మీటింగ్ లో ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు కూడా  రావడం అసాధ్యమన్నారు. రాష్ట్రంలో బిజెపికి మెజార్టీ వస్తుందని...  లేదంటే హంగు ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన జోష్యం చెప్పారు. బీజేపీ నాయకత్వంలోనే  హంగు ప్రభుత్వం వస్తుందన్నారు. మీడియా రాజకీయం చేస్తే.. మేము కూడా రాజకీయం చేస్తామన్నారు. ఎన్నికలకు ముందు రాజకీయముంటుందని.. ఎన్నికల తర్వాత కూడా రాజకీయ ఉంటుందని అన్నారు అరవింద్. 

గల్ఫ్ కార్మికుల కోసం రూ.500 కోట్లతో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడం కాదు.. బీజేపీ ప్రభుత్వం వస్తే  ప్రత్యేక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఈనెల 7న హైదరాబాదులో బీసీ కన్వెన్షన్ కు, 11న ఎస్సీ సమ్మేళనం కోసం ప్రధాని మోడీ వస్తున్నారని ఆయన తెలిపారు. టీవీ ఛానళ్లు రాజకీయ పార్టీలుగా అయిపోయాయని మండిపడ్డారు. ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్ కు నోటీసులు రాగానే కవిత మాయమైపోయిందని అరవింద్ ఎద్దేవా చేశారు.

ALSO  READ : గాంధీభవన్లో కాంగ్రెస్ అభ్యర్థులకు బీ ఫామ్‌లు