సీఎం కేసీఆర్ కుటుంబం పై ఉచ్చు బిగిస్తున్నాం : ధర్మపురి అర్వింద్

తెలంగాణ సీఎం కేసీఆర్  కుటుంబం పై ఉచ్చు బిగిస్తున్నామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.  ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదురుకుంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు పట్టు బిగుస్తున్నాయని చెప్పారు. కేసీఆర్ కుటుంబం మొత్తం జైలుకు పోవడం ఖాయమని అన్నారు.  

రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందన్నారు అర్వింద్.  నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని  ఏడు అసెంబ్లీ సీట్లకు గానూ ఏడూ గెలుస్తామని  ధీమా వ్యక్తం చేశారు.  బీజేపీకి అన్ని స్థానాల్లో అభ్యర్థులు ఉన్నారని తెలిపారు.  అధ్యక్షుడి మార్పు అనేది అధిష్టానం నిర్ణయమన్నారు అర్వింద్.  తానూ పసుపు బోర్డు కంటే ఎక్కువే సాధించానని తెలిపారు.  

చంద్రబాబు చెప్పిందే కాంగ్రెస్ లో అమలు అవుతుందని ఆరోపించారు రేవంత్.  కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేకుండా పోయిందన్నారు.  కాంగ్రెస్ పార్టీ  అంటేనే స్కాముల పార్టీ, ఇండియన్ నేషనల్ కమిషన్ పార్టీ అని విమర్శించారు.  ఆ పార్టీకి కొన్ని సీట్లల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరన్నారు.  

కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి వెళ్లకుండా గ్యారంటీ ఇస్తారా అని ప్రశ్నించారు అర్వింద్.  బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా బీఆరెస్ లో చేరరన్నారు.  సింగిల్ గానే పోటీ చేసి  అధికారంలోకి వస్తామని తమకు ఏ పార్టీ బీ టీమ్ కాదని చెప్పారు.