మంత్రి కేటీఆర్ ను సీఎం చేస్తే బీఆర్ఎస్ 30 ముక్కలవుతుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సీక్రెట్ ఓటింగ్ చేయిస్తే అందరూ సీఎంగా హరీష్ రావునే కోరుకుంటారని చెప్పారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో అర్వింద్ మాట్లాడారు. పసుపు, మామిడి పంటలకు బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసేందేమీ లేదన్నారు. నిజామాబాద్ లో పరిశ్రమలు పెడతామని వచ్చే సంస్థల వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారని ఆరోపించారు.
నిజామాబాద్ పార్లమెంటులో పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలు గెలిపించి తెలంగాణలోని మార్పు తీసుకురావాలని ప్రజలకు అర్వింద్ సూచించారు. ముఖ్యంగా రైతులు బాగా ఆలోచించుకోవాలని చెప్పారు. బీజేపీ గెలిస్తే మూతబడ్డ చక్కెర ఫ్యాక్టరీ తెరిపించడానికి సులువుగా ఉంటుందన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే అవినీతి లేని పరిపాలన ఉంటుందని వెల్లడించారు.