నిజామాబాద్లో మంత్రి కేటీఆర్ పూర్తి అవాస్తవాలు మాట్లాడారని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో గృహలక్ష్మీ పథకానికి రూ.12 వేల కోట్లు కేటాయించినట్లు చూపారని.. వాస్తవంగా ఒక్క రూపాయి కేటాయించలేదని ఆరోపించారు.
ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కేవలం మూడు రోజుల సమయమే ఇచ్చి.. మద్యం టెండర్లకు 15 రోజులకుపైగా టైం కేటాయించడాన్ని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసేందుకే కొత్త కొత్త స్కీంలని కేసీఆర్ కథలు చెబుతున్నారన్నారు.
ALSO READ: అసత్య ప్రచారాలు నమ్మొద్దు.. గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ : మంత్రి వేముల
పార్లమెంటులో తమ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుండటం వల్లే ఆగస్టు 10న నిజామాబాద్లో జరిగిన ప్రోగ్రాంకి వెళ్లలేదని.. దానిని కేటీఆర్రాజకీయం చేస్తున్నారని ఆక్షేపించారు.
కేటీఆర్ నోటికి ఇష్టవచ్చినట్లు మాట్లాడతారని ఆయన తమకు సంస్కారం నేర్పడం ఏంటని ప్రశ్నించారు. పార్లమెంట్ సాక్షిగా బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.