జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా వీఆర్కే కాలేజీలోని ధర్మపురి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ నుంచి 17 గంటల పాటు సేకరించిన కీలక డాక్యుమెంట్లు సోమవారం హైకోర్టుకు తరలించారు. స్ట్రాంగ్ రూమ్లో ఉన్న 17ఏ, 17సీ డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలను బెంచ్ ముందు ఉంచారని తెలుస్తోంది. ఈ మేరకు హైకోర్టులో ఈ నెల 26న విచారణ జరుగనుంది. జగిత్యాల స్ట్రాంగ్ రూమ్ లో ట్రంక్ బాక్స్ కీస్, సీసీటీవీ ఫుటేజీ మిస్సింగ్ అంశాలపై హైకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాకు తెలిపారు.