జగిత్యాల టౌన్, వెలుగు: ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తరఫున కలెక్టర్ యాస్మిన్ బాషా స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కలెక్టర్ కు ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 21న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 26వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటుచేసిన తాగునీరు, మెడికల్ క్యాంపును ప్రారంభించారు. అంతకుముందు ఆలయ అధికారులు కలెక్టర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.