తనపై 16 కేసులు పెట్టినా భయపడకుండా పనిచేశానని ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. 2014 నుంచి కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. తన 15 ఏళ్ల రాజకీయ జీవితంలోజీవన్ రెడ్డి ధైర్యం చెప్పారని వెన్నంటి ప్రోత్సహించారని అన్నారు. కొప్పుల ఈశ్వర్ ఏమీ తెల్వనట్టు నటిస్తారని అన్నారు. కొప్పుల ఓటు కు 5 వేలు ఇచ్చినా తనను గెలిపించిన కార్యకర్తలకు రుణ పడి ఉంటానని చెప్పారు. పెద్దపల్లి నుంచి వంశీకృష్ణ ను గెలిపించాలిసిన బాధ్యత మనందరిపైనా ఉందని అన్నారు. ప్రధాని గా రాహుల్ కావడం ఖాయం అని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ధర్మపురి ప్రాంత రైతాంగం కు నీరు ఇవ్వలేదని అన్నారు. 7 వేల ఎకరాల భూమి గుంజు కొన్న కొప్పుల ఈశ్వర్ రైతుల పొట్ట కొట్టిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ తో మాట్లాడి మూడు దఫాలుగా పంటలకు నీరు విడుదల చేశామని చెప్పారు.
కాంగ్రెస్ తో అన్ని వర్గాలకు న్యాయం : ప్రేమ్ సాగర్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ అన్నారు. 10 ఏళ్ళు గా రాష్టాన్ని సర్వ నాశనం చేసిన ఘనత కేసీఆర్ దని పేర్కొన్నారు. అధికార కోల్పోయిన బీఆర్ఎస్ లీడర్లు మూడు నెలలుగా బయటకు రావడం లేదని అన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు, 6 గ్యారెంటీ లు అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో పెద్దపల్లి లో కాంగ్రెస్ కు టాప్ మెజార్టీ వస్తుందని, వంశీ కృష్ణ భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నారని చెప్పారు.
కార్మిక ద్రోహి కొప్పుల : మక్కన్ సింగ్ ఠాకూర్
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కార్మిక ద్రోహి అని, కుప్పులు, తెప్పలుగా సంపాదించారని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ అన్నారు. ‘సింగరేణి కార్మికుల కు ఒక్క న్యాయం చేశావా కొప్పుల ఈశ్వర్..?’ అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో వడ్ల కోతలు పెడితే రైతుల కంట్లో నీళ్లు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ ను బొంద పెట్టినట్లుగా బీజేపీ నీ ఎంపీ ఎన్నికల్లో బొంద పెట్టి కాంగ్రెస్ అభ్యర్థి, యువకుడు వంశీకృష్ణను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు.
వంశీకృష్ణకు 2 లక్షల మెజార్టీ పక్కా : విజయ రమణ రావు
పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 2 లక్షల మెజార్టీతో విజయం సాధిస్తారని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణ రావు అన్నారు. తెలంగాణ ఉద్యమం పేరిట ఎమ్మెల్యే గా గెలిచి మంత్రి అయిన కొప్పుల ఈశ్వర్.. కోట్లు సంపాదించుకున్నారన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇంటిఇంటికీ వెళ్లి ఓట్లు వేయించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ధర్మపురి రైతుల పంట కు నీళ్లు ఇప్పిచిన చరిత్రఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ఎంపీ అభ్యర్థి గా వస్తున్న కొప్పుల ఈశ్వర్ రైతాంగానికి ఏమీ చేయకుండా నిద్ర పోయారని ఫైర్ అయ్యారు కటింగ్ పేరుతో 12 కిలోలు వడ్లు దోచుకుని రైతుల పొట్టకొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో కటింగ్ లేకుండా వడ్లు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు తమకు ఇబ్బందులు ఉంటే నేరుగా ఫోన్ చేసి చెప్పాలని కోరారు.
17 ఎంపీ సీట్లలో గెలుస్తం : వివేక్ వెంకటస్వామి
సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. తాను తెలంగాణ ఉద్యమం లో చురుకుగా పాల్గొన్నానని చెప్పారు. పెద్దపల్లి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేశానని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఐదింటిని అమలు చేశామని చెప్పారు. తనను ఎలాగా ఆదరించారో వంశీకృష్ణ ను కూడా అలాగే భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కేసీఆర్ హయాంలో చేపట్టి మిషన్ భగీరథ పథకం అవినీతి మయమన్నారు. పాత పైపులు వేసి 45 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. దళితులపై అక్రమకేసులు పెట్టి అహంకారపు పాలన కొనసాగించిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. పెద్దపల్లి నుంచి వంశీ ని అధిక మెజార్టీతో ఎంపీగా గెలిపించాలని కోరారు.
50 వేల మెజార్టీతో వంశీ గెలుస్తరు : జీవన్ రెడ్డి
పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 50 వేలతో గెలువబోతున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ కంటిన్యూ అవుతోందని అన్నారు. నాలుగు నెలల్లోనే ఇచ్చిన హామీలను నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. ఖరీఫ్ నాటికి రూ. 2 లక్షల రైతు రుణమాఫీ కూడా చేయబోతున్నామని చెప్పారు. వంశీకృష్ణ గెలుపు పెద్ద సమస్య కాదన్నారు. 17 పార్లమెంటు స్థానాల్లో 15 చోట్ల కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పారు. పెద్దపల్లిలో వంశీ గెలుపు నల్లేరుమీద నడకేనన్నారు. తాను నిజామాబాద్ అనే పద్మవ్యూహంలో ప్రవేశించానని, అభిమన్యుడిని చేస్తరో.. అర్జునుడిని చేస్తవో తేల్చాలని మంత్రి శ్రీధర్ బాబును విజ్ఞప్తి చేశారు.
కాకా.. బుల్లెట్లకు భయపడలే : గడ్డం వంశీకృష్ణ
తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కాకా వెంకటస్వామి చురుకుగా పాల్గొన్న మహానేత అని పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. బుల్లెట్ గాయాలకు వెరవ లేదని అన్నారు. తెలంగాణ ఏర్పడే వరకు శ్రమించిన నాయకుడని గుర్తు చేశారు. తాను కాకా అడుగుజాడల్లోనే పెద్దపల్లి అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. ధర్మపురి ప్రాంతానికి తనకు అనుబంధం ఉందని, పదేళ్ల క్రితం మొదటి సారి ధర్మపురిలోనే పబ్లిక్ స్పీచ్ ఇచ్చానని అన్నారు. తనను చిన్న కొడుకులా తనను ఆశీర్వదించాలని కోరారు. పెద్దపల్లి అభివృద్ది కోసం పనిచేస్తానని అన్నారు. తనను గెలిపిస్తే ఈ ఎన్నికల తర్వాత ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పారు. తాను పారిశ్రామిక వేత్తగా రాణిస్తున్నానని, సొంతంగా పరిశ్రమ నెలకొల్పి ఐదు వందల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నానని చెప్పారు. తనను గెలిపిస్తే పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానని చెప్పారు.
ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వంశీ : మంత్రి శ్రీధర్ బాబు
ప్రజాసేవ చేసేందుకే వంశీకృష్ణ రాజకీయాల్లోకి వచ్చారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఏఐసీసీ బాగా ఆలోచన చేసి యువకుడిని ఎన్నికల్లో నిలబెట్టాలనే తలంపుతోనే టికెట్ ఇచ్చిందన్నారు. అధికారాన్ని బాల్యం నుంచి చూసిన వ్యక్తి వంశీకృష్ణ అని అన్నారు. తన తాత కాకా వెంకటస్వామి బాటలో ప్రజాసేవలే లక్ష్యంగా ముందుకొచ్చారని చెప్పారు. పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలం కలిసి వంశీని గెలిపించాలని నిర్ణయం తీసుకొని పనిచేస్తున్నామన్నారు. వంశీ ఒక పారిశ్రామిక వేత్త.. తండ్రిపై ఆధార పడకుండా ఒక పరిశ్రమ నెలకొల్పారని, ఐదు వందల మందికి ఉద్యోగాలు కల్పించారని చెప్పారు. ఐదు వేల ఎలక్ట్రిక్ మోటార్ బైక్ లను ఉత్పత్తి చేయించిన పారిశ్రామిక వేత్త వంశీకృష్ణ అని పేర్కొన్నారు. వయస్సు లేకున్నా వంశీ కృష్ణకు గొప్ప అనుభవం ఉందని కొనియాడారు. పెద్దపల్లిలో వంశీ కృష్ణ గెలుపు ఖాయమని అన్నారు. వేలాది మందికి ఉపాధి కల్పించాలని వంశీ భావిస్తున్నారని చెప్పార. వంశీపై తమకు నమ్మకం ఉందని చెప్పారు. బడుగు, బలహీన, మైనార్టీ, ఉన్నత వర్గాలకు సేవల చేయాలనే తలంపుతోనే వంశీకృష్ణ ముందుకు వచ్చారని అన్నారు. అసెంబ్లీలో చెల్లని రూపాయి పార్లమెంటులో చెల్లుతదా..? అని ప్రశ్నించారు. ధర్మపురిలో ఓడిపోయిన కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లిలో ఎలా గెలుస్తారని ప్రశ్నించారు.