
కొండగట్టు, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మంగళవారం కొండగట్టు అంజన్నను ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను విజయం సాధించాలని కార్యకర్తలు రమణారెడ్డి, రాజేశ్ పాదయాత్ర చేస్తానని మొక్కుకున్నారని, వారు మంగళవారం మొక్కు తీర్చుకుంటున్నందున ఆలయానికి వచ్చినట్లు లక్ష్మణ్ కుమార్ తెలిపారు. వీరి వెంట ధర్మపురి, పెగడపల్లి మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.