ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కారు బోల్తా

జగిత్యాల జిల్లా:  ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కారు బోల్తాపడింది. ఎండపల్లి మండలం అంబరీ పెట్ గ్రామ శివారులో లారీని తప్పించబోయి పల్టీ కొట్టింది కారు.  లక్ష్మణ్ కుమార్ , ఇద్దరు గన్ మెన్ లు, డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం అడ్లూరి లక్ష్మణ్ ను  మెరుగైన  చికిత్స కోసం హైదరాబాద్ యశోద  ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. 

హైదరాబాదులో ఓ వివాహానికి హాజరై తిరిగి ధర్మపురికి వెళ్తుండగా ఫిబ్రవరి 19 తెల్లవారుజామున 3 గంటలకు ఎండపల్లి మండలం అంబారిపేట గ్రామ శివారులో ఈ ప్రమాదం జరిగింది.  ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవ్వడంతో ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో కారులో ఉన్న నలుగురికి గాయలయ్యాయి. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కారు అద్దాలు పగలకొట్టి కారులోంచి బయటకు తీశారు.  వెంటనే  పోలీస్ వెహికల్ లో కరీంనగర్ అపోలో ఆసుపత్రికి తరలించారు వెల్గటూర్ ఎస్సై ఉమా సాగర్. తర్వాత మెరుగైన వైద్యం కోసం కాసేపటి క్రితం హైదరాబాద్ లోని యశోద  ఆస్పత్రికి తరలించారు.