ప్రభుత్వ విప్, ధర్మపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ జూన్ 09వ తేదీ ఆదివారం రోజున కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శాలువాతో సన్మానించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అంజన్న ఆశీస్సులతోనే పెద్దపెల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ విజయం సాదించారన్నారని చెప్పారు. అలాగే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 8 ఎంపీ స్థానాలను గెలుచుకున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఉంటాయన్నారు లక్ష్మణ్. ఎంపీగా గడ్డం వంశీని గెలిపించిన సందర్భంగా పెద్దపల్లి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కొండగట్టు అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. త్వరలోనే మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని తెలిపారు లక్ష్మణ్.