ధర్మారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్.. పుల్లూరి రఘు వర్ధన్ రావు 11 వ వర్దంతి

జులపల్లి మండలం వడ్కాపురం గ్రామంలో.. పెద్దపల్లి జిల్లా ధర్మారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్   పుల్లూరి రఘు వర్ధన్ రావు 11 వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన  విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు గ్రామస్తులు.ఈ కార్యక్రమంలో ధర్మారం కాంగ్రెస్ నాయకులు కాడే సూర్యనారాయణ,తన సతీమణి పుల్లూరి మంజుల,కుమార్తె నిహారిక రావు, పుల్లూరి కృపాకర్ రావు, నర్సింగ్ యాదవ్  మొగురం రమేష్ వైస్ ఎంపీపీ,  సర్పంచ్, ఎర్రోళ్ల తిరుప్పల రాములు గుమ్మడి లక్ష్మణ్, తువ్వ కనకయ్య, వేల్పుల ఓదెలు పాల్గొని వారు చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. అనంతరం పేదలకు పండ్లు పంచిపెట్టారు.