
పిట్లం, వెలుగు: వర్షాలు కురవాలని కోరుతూ ధర్మారం గ్రామస్థులు బైక్‌లపై యాత్ర చేసి హనుమాన్ ఆలయాల్లో పూజలు చేశారు. శనివారం పిట్లం మండలంలోని 11 గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించి హనుమాన్ఆలయాల్లో పూజలు, అభిషేకాలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఖరీఫ్ వచ్చి నెల దాటినా ఇంత వరకు పెద్ద వర్షం కురవలేదన్నారు. వర్షాభావంతో నారుమళ్లు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ 11 గ్రామాల్లో పర్యటించి పూజలు చేసినట్లు వారు తెలిపారు.