- అడ్డుకున్న సీఆర్పీఎఫ్ జవాన్లు
భద్రాచలం, వెలుగు : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా తెర్లగూడ వద్ద తెలంగాణకు చెందిన ప్రజా, పౌరసంఘాల నేతలు గురువారం రాత్రి ధర్నా నిర్వహించారు. ఇటీవల దండకారణ్యంలో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని కోరుతూ పౌరహక్కుల, ప్రజాసంఘాల లీడర్లు కుంట మీదుగా ఛత్తీస్‌గఢ్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో తొలుతకుంట వద్ద సీఆర్పీఎఫ్జవాన్లు అడ్డుకున్నారు. ఇతర వాహనాలను కూడా నిలిపివేశారు.
మావోయిస్టుల బంద్ నడస్తున్నందున అటుగా వెళ్లొద్దంటూ వారించారు. వారిని తప్పించుకుని వేరే మార్గంలో బీజాపూర్‌కు బయలుదేరగా 40 కి.మీలకు ముందే రాత్రి 11 గంటల సమయంలో ఆపేశారు. ఎన్కౌంటర్ జరుగుతోందని, అటు వెళ్లొద్దని అడ్డుకున్నారు. దీనితో తెర్లగూడ వద్ద పౌర, ప్రజాసంఘాల లీడర్లు ఆందోళన చేపట్టారు. దేశపౌరులమైన తాము ఈ దేశంలోని ఇతర ప్రాంతాలకు పోయే హక్కు లేదా..? అంటూ నినాదాలు చేశారు. ఆదివాసీలపై జరుగుతున్న దాడులు, ఎన్కౌంటర్లు నిలిపివేయాలని కోరారు.