మత్స్య శాఖ అధికారిని సస్పెండ్ చేయాలి

సూర్యాపేట, వెలుగు: సంఘం తీర్మానం లేకుండా గ్రామానికి సంబంధం  లేని వ్యక్తులకు  మత్స్య  సహకార సొసైటీ లో సభ్యత్వం ఇచ్చిన  జిల్లా మత్స్య శాఖ అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం జిల్లా కలెక్టరేట్ ముందు  రామారం ఊర చెరువు  మత్స్య సహకార సొసైటీ సభ్యులు ధర్నా చేశారు.    

రామారం ఊర చెరువు  సొసైటీ ఎన్నికలకు  అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని, ఆధార్ లో మార్పులు చేసి  గ్రామానికి సంబంధం  లేనివారికి   సొసైటీ లో  సభ్యత్వాలు కల్పించారని ఆరోపించారు. సొసైటీ లో  గ్రామానికి చెందిన మూడు కుటుంబాలకు మాత్రమే  అర్హత ఉందని, మిగిలిన కుటుంబాలకు సొసైటీతో   సంబంధం లేదన్నారు. ఈ విషయాన్ని గురించి అడిగితే ‘ నా  ఇష్టం వచ్చినట్లు చేస్తా..  నన్ను అడగడానికి మీరెవరు’ అంటూ  బెదిరిస్తున్నాడని ఆరోపించారు.   జిల్లా కలెక్టర్ స్పందించి సొసైటీ లో అక్రమ సభ్యత్వాలు  రద్దు చేయాలని కోరారు.  ధర్నాలో   బొల్లమ్ నాగయ్య, మల్లేశ్, రాములు, పరమేశ్​ తదితరులు పాల్గొన్నారు.