ఆర్మూర్, వెలుగు : తమకు న్యాయం చేయాలని కోరుతూ చేపూర్ గ్రామానికి చెందిన బండ గంగాధర్ (56) కుటుంబసభ్యులు, బంధువులు సోమవారం ఆర్మూర్ లో అడ్వకేట్సదానందం ఇంటి ముందు ధర్నా చేశారు. గంగాధర్కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం రెండు హత్యకేసుల్లో జైలుకు వెళ్లిన గంగాధర్, అనారోగ్య కారణాలతో బెయిల్పై వచ్చాడు. చేపూర్కు చెందిన విజయ్కుమార్సహాయంతో లాయర్సదానందం వద్ద రూ.10 లక్షలు అప్పు తీసుకున్నాడు.
అప్పు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో ఇతడి మూడెకరాల భూమిని విజయ్, సదానందం ఆక్రమించేందుకు ప్రయత్నించారు. తన భూమిని లాక్కుంటున్నారని ఆవేదన చెందిన గంగాధర్ఆదివారం రాత్రి లాయర్ సదానందం ఇంటి ముందు తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు.
లాయర్ సదానందం, విజయ్ ఒత్తిడి కారణంగానే గంగాధర్సూసైడ్చేసుకున్నాడని సోమవారం సదానందం ఇంటి ముందు ధర్నాకు దిగారు. సీఐ రవికుమార్ ఘటనా స్థలానికి చేరుకొని న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.