- 5వ బెటాలియన్ కానిస్టేబుళ్లకుటుంబ సభ్యుల ధర్నా
ములుగు(గోవిందరావుపేట), వెలుగు : పోలీసు బెటాలియన్కానిస్టేబుళ్లకు 8 గంటల పని ఉండాలని, 15 రోజులకు ఒకసారి ఉండే రిజిస్టర్పర్మిషన్ పెంచొద్దని ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి వద్ద టీజీఎస్పీ 5వ బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బుధవారం చల్వాయిలో హై వే పై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కానిస్టేబుళ్లు కుటుంబ సభ్యులతో గడపలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏక్ స్టేట్.. ఏక్పోలీసు వ్యవస్థను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేరుకే ప్రభుత్వ ఉద్యోగులుగా బతుకుతున్నామని, చేసే పనిలేక బండరాళ్లు ఎత్తడం, గడ్డి పీకడం వంటి పనులు చేయాల్సి వస్తోందన్నారు.
నెలలో నాలుగు రోజులు మాత్రమే ఇంటికి రావడం వల్ల బిడ్డలు తండ్రిని గుర్తుపట్టలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లు ఒకేచోట పోస్టింగ్ఇవ్వాలని కోరారు. గంటపాటు ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్నిలిచిపోయింది. పస్రా సీఐ జి.రవీందర్పోలీసు కుటుంబాలకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు.