భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పెండింగ్లో ఉన్న రూ. 7,800కోట్ల స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం రిలీజ్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బుర్ర వీరభద్రం డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, బడ్జెట్లో విద్యారంగానికి నిధులు పెంచాలనే పలు డిమాండ్లతో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచాలన్నారు. ఖాళీగా ఉన్న 26వేల టీచర్ పోస్టులను, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ములకలపల్లి, సుజాతనగర్, కొత్తగూడెం మండల కేంద్రాల్లో జూనియర్ కాలేజీలు, హాస్టల్స్ ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రాన్ని ఇచ్చారు. ధర్నా చేస్తున్న నేతలను అక్కడి నుంచి లేపేందుకు పోలీస్లు యత్నించగాతోపులాట జరిగింది. ఈ ప్రోగ్రాంలో నాయకులు సండ్ర భూపేందర్, అభిమన్యు, సందీప్, అభిమిత్ర, నాగకృష్ణ, యశ్వంత్ పాల్గొన్నారు.