ఆదిలాబాద్ టౌన్, వెలుగు : ఆదిలాబాద్పట్టణంలోని కస్తాల రామకిష్టు కాలనీకి నీరందించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కాలనీ వాసులు ఖాళీ బిందెలతో కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. కాలనీలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌చేశారు.
కొన్ని రోజులుగా మిషన్‌భగీరథ నీటి సరఫరా లేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగానే సమస్య తలెత్తిందని ఆరోపించారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.