
ఖానాపూర్, వెలుగు: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ వాటర్ సెక్షన్ లో పనిచేస్తున్న కార్మికుడు సయ్యద్ జహేద్ హుస్సేన్‌ను అధికార బీఆర్ఎస్ పార్టీ 10వ వార్డు కౌన్సిలర్ తొంటి శ్రీనివాస్ అకారణంగా దూషించిన వ్యవహారం వివాదాస్పదమైంది. ఈనెల 4న రాత్రి సమయం వాటర్ ట్యాంక్ వద్ద విధులు నిర్వహిస్తున్న తనను కౌన్సిలర్ దూషించారని కమిషనర్, ఎస్సైలకు హుస్సేన్ కంప్లైంట్ చేశారు. కాగా కౌన్సిలర్ తీరును నిరసిస్తూ మున్సిపల్ కార్మికులు, సిబ్బంది మున్సిపల్ కార్యాలయం ముందు బుధవారం ధర్నా చేశారు.
కౌన్సిలర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కారణంగా మున్సిపల్ ఆఫీసులో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనిపై కౌన్సి లర్ శ్రీనివాస్ ‘వెలుగు’కు వివరణ ఇస్తూ తాను హుస్సేన్‌ను తిట్టలేదని, తనకున్న పాత చనువుతో మాట్లాడానని వివరించారు. తన ఎదుగుదలను చూడలేకనే కొందరు ఇలా చేయిస్తున్నారని అయన ఆరోపించారు.