మరిపెడ(చిన్న గూడూరు), వెలుగు: మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో గత ప్రభుత్వం నిర్మించిన 100 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో అవినీతి చోటుచేసుకుందని, బీఆర్ఎస్ కార్యకర్తలకు అనుకూలంగా చిన్న గూడూరు గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానం చేశారని గ్రామస్థులు సోమవారం ఎంపీడీఓ ఆఫీస్ ఎదుట ధర్న చేశారు. ఆ తీసుకొని తీర్మానం రద్దు చేసి, నిజమైన అర్హులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ధర్నాలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు వడ్లకొండ ఆదం,మైనారిటీ మండల అధ్యక్షులు జహంగీర్,ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు గంగారబోయిన శ్రీను,యూత్ అధ్యక్షులు దుండి వెంకన్న,మహిళా శిల అధ్యక్షులు జంపాల శోభ,మాజీ వార్డ్ మెంబర్ కొత్త శేఖర్,మొగలగాని రాములు,గంగరబోయిన వెంకన్న,జంపాల శ్రీనివాస్,మాజీ సర్పంచ్ వెంకన్న,నిరంజన్ పాల్గొన్నారు. .
ALSO READ : గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీలనువెంటనే పరిష్కరించాలి : భవేశ్ మిశ్రా