ఇండ్ల స్థలాల కోసం తహసీల్దార్​ ఆఫీఎస్​ ఎదుట ధర్నా

ఎడపల్లి, వెలుగు : ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఎడపల్లి తహసీల్దార్​ ఆఫీస్​ ఎదుట తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు.   తెలంగాణ వచ్చి పదేండ్లు అవుతున్నా నేటికి ఇండ్ల పంపిణీ చేయలేదని విమర్శించారు.  ప్రభుత్వం స్పందించే వరకు తమ పోరాటం ఆపబోమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో  ప్రజాసంఘాల జిల్లా నాయకులు  పెద్ది వెంకట రాములు,  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నూర్జాన్, సీఐటీయూ  జిల్లా కార్యదర్శి ఏశాల గంగాధర్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జంగం గంగాధర్,   గంగమణి, లక్ష్మి, బాలు, సాయమ్మ ,మణమ్మ, పద్మ, భూమవ్వ, రాజమణి రాధా  పాల్గొన్నారు.