తాగునీళ్లు అందడం లేదని‌‌‌‌ మహిళల ఆందోళన

ఆసిఫాబాద్, వెలుగు:  రెబ్బెన మండలం గంగాపూర్ లో తాగునీళ్లు అందడం లేదని‌‌‌‌మహిళలు  ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ ఆఫిస్ వద్ద  నిరసన చేపట్టి , సర్పంచ్ ఇంటి‌‌‌‌ఎదుట ధర్నా‌‌‌‌చేశారు.‌‌‌‌ఇరవై రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని, అధికారులకు, సర్పంచ్ కు ‌‌‌‌చెప్పినా‌‌‌‌పట్టించుకోవడం‌‌‌‌మండిపడ్డారు.‌‌‌‌

గ్రామంలో 40 కుటుంబాలు ఉండగా ఒకే ఒక బోర్ వెల్ ఉందని,‌‌‌‌అదికూడా చెడిపోవడంతో‌‌‌‌నీళ్ల కోసం గోస పడుతున్నామని ఆవేదన చెందారు.‌‌‌‌గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు‌‌‌‌వస్తున్నా ..‌‌‌‌రావట్లేదని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని సర్పంచ్ భర్త వాట్సాప్ లో మెసేజ్​  పెట్టడంతో‌‌‌‌ ఆగ్రహించిన మహిళలు సర్పంచ్ ఇంటికి ఖాళీ బిందెలతో వెళ్లి ధర్నా చేశారు.  నీళ్ల సమస్య  పరిష్కరించకుంటే  కలెక్టరేట్​ ముట్టడిస్తామని చెప్పారు.‌‌‌‌