బొగ్గు బ్లాక్‌‌‌‌ల రక్షణకు సమ్మెకైనా వెనుకాడం

బొగ్గు బ్లాక్‌‌‌‌ల రక్షణకు సమ్మెకైనా వెనుకాడం
  • కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల జేఏసీ లీడర్లు
  • సింగరేణి జీఎం ఆఫీస్‌‌‌‌ ఎదుట ధర్నా 

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : తెలంగాణలోని బొగ్గు బ్లాక్‌‌‌‌లను సింగరేణికే కేటాయించాలని, వాటి కోసం సమ్మెకైనా వెనుకాడేది లేదని కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక లీడర్లు స్పష్టం చేశారు. గోదావరిఖనిలోని జీఎం ఆఫీస్‌‌‌‌ ఎదుట బుధవారం సాయంత్రం జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, సీఐటీయూ కార్యదర్శి మెండె శ్రీనివాస్, ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్షుడు కె.విశ్వనాథ్‌‌‌‌, నాయకులు తోకల రమేశ్‌‌‌‌ మాట్లాడారు.

బొగ్గు బ్లాక్‌‌‌‌ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులంతా ఐక్యమై కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. దేశంలోని 500 బొగ్గు బ్లాక్‌‌‌‌లను దశలవారీగా వేలం వేస్తూ వస్తున్నారని, ఇప్పటికే 140కి పైగా బ్లాక్‌‌‌‌లు కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లాయన్నారు. కోల్‌‌‌‌ బ్లాక్‌‌‌‌లు సింగరేణికి కేటాయించకపోతే సంస్థ నష్టాల పాలై కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. బొగ్గు బ్లాక్‌‌‌‌లను నామినేషన్‌‌‌‌ పద్ధతిలో కూడా కేటాయించవచ్చని, బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.

ధర్నాలో లీడర్లు మడ్డి ఎల్లాగౌడ్, రంగు శ్రీనివాస్, ఆరెల్లి పోశం, తోట నరహరి, ఆసరి మహేశ్‌‌‌‌, గజేంద్ర పాల్గొన్నారు. అలాగే మందమర్రి జీఎం ఆఫీస్‌‌‌‌ ఎదుట జరిగిన ధర్నాలో ఏఐటీయూసీ స్టేట్‌‌‌‌ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య ఏఐటీయూసీ కేంద్ర కమిటీ సెక్రటరీ ఎండి.అక్బర్‌‌‌‌ అలీ, సింగరేణి కాలరీస్‌‌‌‌ ఎంప్లాయీస్‌‌‌‌ యూనియన్‌‌‌‌ డిప్యూటీ జనరల్‌‌‌‌ సెక్రటరీ నాగరాజ్‌‌‌‌, లీడర్లు చిప్పనర్సయ్య, దాగం మల్లేశ్, సాంబారు వెంకటస్వామి

శ్రీరాంపూర్‌‌‌‌ ఏరియా జీఎం ఆఫీస్‌‌‌‌ వద్ద జరిగిన ధర్నాలో సింగరేణి కాలరీస్‌‌‌‌ ఎంప్లాయిస్‌‌‌‌ యూనియన్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ గుల్ల బాలాజీ, సెక్రటరీ అంబాల శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా సెక్రటరీ రంజిత్‌‌‌‌ పాల్గొన్నారు. అలాగే కొత్తగూడెంలోని సింగరేణి హెడ్‌‌‌‌ఆఫీస్‌‌‌‌ ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌‌‌‌కే. సాబీర్‌‌‌‌పాషా, నాయకులు నరాటి ప్రసాద్, విజయగిరి శ్రీనివాస్, శేషయ్య, యాకూబ్‌‌‌‌ షావలీ పాల్గొన్నారు.