
కోల్బెల్ట్, వెలుగు : బెల్లంపల్లి ప్రాంతంలో పనిచేస్తున్న తమకు జీతాలు సకాలంలో ఇవ్వాలని డిమాండ్చేస్తూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో సులభ్ కార్మికులు మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగారు. శుక్రవారం ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ప్రతి నెలా జీతాలు ఆలస్యంగా చెల్లిస్తున్నారని, గత నెల జీతాలు ఇప్పటివరకు ఇవ్వలేదని పేర్కొన్నారు.
సింగరేణి యాజమాన్యం తమ సమస్యలు పరిష్కారించాలని కోరుతూ డీవైపీఎం మైత్రేయబంధుకు వినతిపత్రం అందజేశారు. ఐఎఫ్టీయూ లీడర్లు టి.శ్రీనివాస్, జాఫర్, భూమయ్య, రాములు, ఈశ్వరి, ఎల్లమ్మ, చిన్నక్క తదితరులు పాల్గొన్నారు.