కాంట్రాక్ట్​ కార్మికులకు హై పవర్​ వేతనాలు చెల్లించాలి

      సింగరేణి కోల్​ మైన్స్​ కార్మిక సంఘ్​అధ్యక్షుడు సత్తయ్య

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్​ కార్మికులకు హైపవర్​ వేతనాలు చెల్లించే విధంగా యాజమాన్యం చర్యలు చేపట్టాలని సింగరేణి కోల్​ మైన్స్​ కార్మిక సంఘ్​అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్​ చేశారు. కాంట్రాక్ట్​ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్​ ఎదుట కోల్​ మైన్స్​ కార్మిక సంఘ్​(బీఎంఎస్​) ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. జీఎం సీపీపీ జక్కం రమేశ్​​కు వినతిపత్రాన్ని ఇచ్చారు.

ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ కాంట్రాక్ట్​ కార్మికులకు హైపవర్​ వేతనాలు చెల్లించడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. 20శాతం బోనస్​ చెల్లించాలన్నారు. ఈఎస్​ఐ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రతినెలా 7న జీతాలివ్వాలన్నారు. ఈ ప్రోగ్రాంలో కార్మిక సంఘ్​, ఏబీకేఎంఎస్ నాయకులు మహేశ్, మాదవ్​నాయక్​, ఇనపనూరి నాగేశ్వరరావు, దొడ్డి నిర్మల, మొగిలిపాక రవి, సంఘం చందర్​, మూర్తి, నర్మద, అశ్విని, మాధురి పాల్గొన్నారు.