రైతులకు రుణమాఫీ చేయాలి: రాజిరెడ్డి

కరీంనగర్ టౌన్, వెలుగు: రైతులకు రూ.లక్ష రుణమాఫీ వడ్డీతో సహా చెల్లించాలని, రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనను అమలుచేయాలని గురువారం బీజేపీ కిసాన్​మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్​ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మోర్చా జిల్లా అధ్యక్షుడు రాజిరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్​రైతుల పట్ల మోసపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రుణమాఫీ చేయడంలో ఫెయిలైందన్నారు.

ప్రకృతి విపత్తులతో పంటలకు నష్టం కలిగితే రైతులను ఆదుకోవడానికి కేంద్రం తీసుకొచ్చిన ఫసల్​బీమా యోజనను రాష్ట్రంలో ఎందుకు అమలుచేయడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, ప్రవీణ్​ రావు, వాసుదేవరెడ్డి, లక్ష్మీనారాయణ, రమణారెడ్డి, కల్యాణ్‌, సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.