మెదక్ టౌన్, వెలుగు : పెండింగ్బిల్లులు విడుదల కోసం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం ఆ సంఘం జిల్లా నాయకులు, టీచర్లు కలెక్టరేట్ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా తపస్రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న 4 డీఏలను వెంటనే ప్రకటించాలని
పీఆర్సీరిపోర్టు తెప్పించుకొని 60 శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలని, జీవో 317 బాధితులకు న్యాయం చేయాలని, జీపీఎఫ్ పెండింగ్ బిల్లును విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం అడిషనల్కలెక్టర్నగేశ్కు వినతిపత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా తపస్ నాయకులు, టీచర్లు పాల్గొన్నారు.
సంగారెడ్డి టౌన్ : పెండింగ్డీఏలు, బిల్లులు చెల్లించాలని తపస్ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి దత్తాత్రి , అడివప్ప మాట్లాడుతూ.. టీచర్లకు రావాల్సిన డీఏలు, జీపీఎఫ్, మెడికల్, సరెండర్, రిటైర్మెంట్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు.
వీటిని వెంటనే చెల్లించాలని డిమాండ్చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏవో పరమేశ్వర్ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో తపస్జిల్లా బాధ్యులు, టీచర్లు పాల్గొన్నారు.
సిద్దిపేట : ఎన్నికల సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, కాంగ్రెస్మేనిఫెస్టోలో పెట్టిన పీఆర్సీ ని వెంటనే అమలు చేసి, పెండింగ్బిల్లులను ఏకకాలంలో చెల్లించాలని తపస్ జిల్లా అధ్యక్షుడు ఊడెం రఘువర్థన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ వద్ద నిర్వహంచిన ధర్మాగ్రహ దీక్షలో పాల్గొని మాట్లాడారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను విస్మరించిన ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని, ఆ విషయాన్ని ప్రభుత్వం గుర్తెరిగి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. అనంతరం జాయింట్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.