మెదక్ టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని, వేతనం రూ.18 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ మాట్లాడుతూ. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
ALSO READ :ఆశా వర్కర్ల జీతాలు పెంచాలి..మంత్రి తలసాని ఇంటి ముట్టడికి యత్నం
టార్గెట్ల పేరుతో ఆశా వర్కర్లను మానసికంగా ఇబ్బందుల గురిచేస్తున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి సావిత్రి, నాయకులు దేవమ్మ, శోభ, రాజేశ్వరి, సునీత, స్వప్న, సరోజ, రాణి, పెంటమ్మా, పద్మ, దుర్గ, మంజుల పాల్గొన్నారు.