గోదావరిఖని, వెలుగు : రామగుండం పట్టణంలోని 62.5 మెగావాట్ల జెన్ కో ప్లాంట్‌ను విస్తరించే వరకు పోరాటం ఆగదని బీజేపీ రాష్ట్ర నాయకులు కౌశిక హరి తెలిపారు. బి–థర్మల్ కేంద్రాన్ని విస్తరించాలని డిమాండ్ చేస్తూ ప్లాంట్ ఎదుట బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కౌశిక హరి మాట్లాడుతూ రామగుండం విద్యుత్ కేంద్రాన్ని 800 మెగావాట్ల సామర్ధ్యం గల రెండు కొత్త యూనిట్లకు ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోరాడి సాధించుకున్నామని తెలిపారు.
ఈ కొత్త ప్లాంట్ నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం రూ.7,960 కోట్లను కూడా మంజూరు చేసిందని ఆయన చెప్పారు. కానీ తెలంగాణలో మాత్రం ఈ ప్లాంట్‌ను విస్తరించకుండా తెలంగాణ ప్రభుత్వం యాదాద్రికి తరలించిందని ఆయన ఆరోపించారు. ప్లాంట్ విస్తరణ జరిగే వరకు పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కౌశిక లత, మహావాది రామన్న, మారం వెంకటేష్, మద్దికుంట శంకర్, పున్నం శశికుమార్, కుక్క గంగా ప్రసాద్, దారంగుల కుమార్, నిమ్మరాజుల రవి, తోడేటి రవికుమార్, గాలంకి ప్రసాద్, కౌశిక భరత్, తదితరులు
పాల్గొన్నారు.