జీపీ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలి :  ఎదుట్ల కురుమయ్య 

జీపీ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలి :  ఎదుట్ల కురుమయ్య 
  • జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా

వనపర్తి టౌన్, వెలుగు: పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని మంగళవారం వనపర్తి కలెక్టర్ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు ఎదుట్ల కురుమయ్య అధ్యక్షతన నిరసన తెలిపారు.  ఈ సందర్భంగా కురుమయ్య  మాట్లాడుతూ..  పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించకుండా నెలల తరబడి పెండింగ్‌‌‌‌లో పెట్టడం తగదన్నారు.

 ప్రభుత్వం స్పందించి వెంటనే జీపీ కార్మికులకు పెండింగ్ వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ ఏఓ, డీఎల్ పీఓకు అందజేశారు. కురుమయ్య, అరుణ్ కుమార్, గణేశ్, రాజు, సుబ్బయ్య , గట్టమ్మ  రామచంద్రయ్య పాల్గొన్నారు.