
టేక్మాల్, వెలుగు: ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేసిన భర్త ఇంటి ముందు ఓ భార్య ధర్నాకు దిగింది. మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రానికి చెందిన ప్రేమ్ కుమార్ గౌడ్, రేణుక 5 సంవత్సరాలుగా ప్రేమించుకుని 8 నెలల కింద శేరిలింగంపల్లి ఆర్యసమాజ్‌లో పెండ్లి చేసుకున్నారు.
హైదరాబాద్ లో కాపురం పెట్టారు. దళిత కులానికి చెందిన అమ్మాయిని వదిలేయాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో రేణుకను దూరం పెట్టాడు. దీంతో ఏమి చేయాలో తోచని రేణుక తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాకు దిగింది.