జగిత్యాల కలెక్టరేట్ ముందు ఏఎన్ఎంల ధర్నా

అదనపు భారంతో సతమతమవుతున్న తమకు ఈ - కేవైసీ బాధ్యతలు అప్పగించడం సరికాదని ఏఎన్ఎంలు ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాల కలెక్టరేట్ ముందు ఏఎన్ఎంలు నిరసన దీక్ష చేపట్టారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చినా.. పరిష్కారం కాకపోవడంతో తప్పని పరిస్థితుల్లో నిరసన దీక్ష చేపట్టామని వెల్లడించారు. మాత శిశు సంరక్షణ బాధ్యతలతో పాటు గ్రామాల్లో అంటు వ్యాధుల నిర్ములన కార్యక్రమాలతో సహా డేటా ఎంట్రీ పనులు కూడా తామే చేస్తున్నామని చెప్పారు. 

వచ్చే నెల నుండి కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమవుతున్న విషయాన్ని ఏఎన్ఎంలు గుర్తు చేశారు. ఇప్పటికే అధిక పని భారంతో ఒత్తిడికి గురవుతున్నట్లు, ఇలాంటి పరిస్థితుల్లో ఈకేవైసీ పనులు తాము చేయలేమన్నారు. ఆ బాధ్యతల నుండి తమను తప్పించాలని కోరారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వర్క్ ఉంటుందని చెప్పి..ఇప్పుడు 24 గంటల పాటు డ్యూటీలు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఆదివారం కూడా సెలవు ఇవ్వకపోవడంతో ఫ్యామిలీతో గడిపే అవకాశం లేకుండా పోతోందన్నారు.