కాంట్రాక్ట, ఔట్ సోర్సింగ్ ఏఎన్ఎంలను రెగ్యులైజ్ చేయాలంటూ.. ఏఎన్ఎంలు ఒంటికాలిపై నిరసనకు దిగారు. జగిత్యాల పట్టణంలో రెగ్యులరైజ్ చేయాలంటూ ధర్నా చేపట్టారు. ఏఎన్ఎంలు ఎన్ని రకాలుగా నిరసనలు తెలుపుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేసున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మాదిరిగానే.. మాకు కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించి.. రెగ్యులైజ్ చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లా వ్యాప్తంగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఏఎన్ఎంలు ఐక్యంగా ఉండి హక్కుల కోసం చేస్తున్న నిరసనలు స్ఫూర్తి ఆదర్శమని ప్రధాన కార్యదర్శి మధురిమ అన్నారు. ప్రభుత్వం దీనిపై వెంటనే సానుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతామని హెచ్చరించారు.