రెండో ఏఎన్‌‌‌‌‌‌‌‌ఎంల నోట్లో మట్టికొట్టొద్దు.. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏఎన్‌‌‌‌‌‌‌‌ఎంల ధర్నా

  • నోటిఫికేషన్ రద్దు చేసి రెగ్యులరైజ్ చేయాలి 

సూర్యాపేట, నల్గొండ అర్భన్, దేవరకొండ, వెలుగు: పీహెచ్‌‌‌‌‌‌‌‌సీల్లో 15 ఏండ్లుగా పనిచేస్తున్న రెండో ఏఎన్ఎంల నోట్లో మట్టికొట్టొద్దని ఏఐటీయూసీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుటఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకపోతుల శ్రీనివాస్, నల్గొండ డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో ఆఫీస్‌‌‌‌‌‌‌‌ ముందు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రి ముందు జిల్లా అధ్యక్షుడు నూనె రామస్వామి ఆధ్వర్యంలో ఏఎన్‌‌‌‌‌‌‌‌ఎంలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2018 నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌లో 30 శాతం వెయిటేజీ ఇచ్చిన సర్కారు.. ప్రస్తుతం ఇచ్చిన నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌లో 20 శాతానికి తగ్గించడం సరికాదన్నారు.

వీఏవోలు, ఆర్టీసీ కార్మికులను న్యాయం చేసిన సర్కారు..  కరోనా కాలంలో ప్రాణాలు లెక్కచేయకుండా పనిచేసిన ఏఎన్ఎంలను కూడా ఆదుకోవాలని కోరారు. ప్రస్తుతం నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ను వెంటనే రద్దు చేసి కండీషన్లు లేకుండా పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.  ధర్నా అనంతరం కార్యాలయ అధికారులకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు అందించారు. ఈ ధర్నాలో ఏఎన్ఎం నేతలు లక్ష్మీబాయి, స్వప్న, వై విజయ, శిరోమణి, రమాదేవి నీరజ సరిత రూప, గోపమ్మ, గీత, పద్మ, శైలజ, కవిత, విజయ,  వనిత, పద్మావతి,  మబి అరుణ, సరళ, నాగమణి,వసంత,  ఉమారాణి,  లలిత,  పార్వతి, రత్నకుమారి  పాల్గొన్నారు.