MRO ఆఫీస్ కాడ డబుల్ బెడ్రూం కోసం ధర్నా

జగిత్యాల అర్బన్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. పట్టణ పరిధిలో మొత్తం 3355 మంది అర్హులను గుర్తించగా వారికి సంబంధించిన క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికేట్ ల కోసం ప్రజలు పెద్ద ఎత్తున కార్యాలయానికి తరలివచ్చారు. అయితే ఆర్ఐ ఒక్కడే ఉంటడం వల్ల సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరుగుతుందని, మూడు రోజుల్లోపే అధికారులకు ఈ సర్టిఫికెట్లు ఇవ్వడం ఎలా సాధ్యం అని ప్రజలు అధికారులను నిలదీశారు. అర్హులు వారి దరఖాస్తులను మీ సేవలో సమర్పించి తహశీల్దార్ కార్యాలయంలో అప్పగిస్తే మూడు రోజుల్లోగా వారికి క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికేట్లు ఇస్తామని తహసీల్దార్ చెప్పారు. ఆందోళన చెందవలసిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే నిరుపేదలకు డబుల్ ఇండ్లు ఇవ్వకుండా ఉన్న వారికే ఇస్తున్నారని డబుల్ బెడ్ రూం లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.