మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల పట్టణ పరిధిలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికార బీఆర్ఎస్పార్టీ వివక్ష చూపుతోందని ఆరోపిస్తూ మంచిర్యాల మున్సిపాలిటీ ఆఫీసు ఎదుట కాంగ్రెస్ లీడర్లు ఆందోళన చేపట్టారు. మంచిర్యాలలో నీటి కొరత ఉందని పేర్కొంటూ ఖాళీ కుండలను ప్రదర్శించి పగులగొట్టారు. మున్సిపాలిటీలో సమస్యలను పేర్కొంటూ మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్‌కు కౌన్సిలర్ లు వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా మున్సిపాలిటీ ప్రతిపక్ష నేత డాక్టర్ రావుల ఉప్పలయ్య మాట్లాడుతూ
విపక్ష సభ్యుల పట్ల అధికార బీఆర్ఎస్ వివక్ష చూపుతూ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు. అనేక సమస్యలున్నా పరిష్కరించడంలో విఫలమైందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలుకు నోచుకోలేదని ఫైర్అయ్యారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. నేతలు వేములపల్లి సంజీవ్, పట్టణ అధ్యక్షుడు తూముల నరేశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.