మోకాళ్లపై కూర్చుని వేడుకుంటున్నాం.. మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి..

మోకాళ్లపై కూర్చుని వేడుకుంటున్నాం.. మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి..

తమ విధులను రెగ్యులరైజ్ చేయాలంటూ వికారాబాద్ జిల్లా పరిగిలో కాంట్రాక్ట్  ఏఎన్ఎంలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి, మోకాళ్లపై కూర్చుని.. సమ్మెను కొనసాగించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటూ ఫ్లకార్డులు  ప్రదర్శిస్తూ.. నినాదాలు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లపై నాలుగు రోజులుగా సమ్మె చేస్తుంటే.. ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని ఏఎన్ఎంలు ఆవేదన వ్యక్తం చేశారు. 

వెంటనే ఎంపీహెచ్ఏ నోటిఫికేషన్ ను రద్దు చేసి.. ఎలాంటి అర్హత పరీక్ష లేకుండానే తమ విధులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏఎన్ఎంల సమ్మెకు స్థానిక సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. ఇతర శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను ఎలాగైతే రెగ్యులరైజ్ చేస్తున్నారో.. అదే విధంగా ఏఎన్ఎంలను కూడా అలాగే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.