జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపాలిటీ కార్యాలయం ముందు పారిశుధ్య కార్మికుల ధర్నా చేపట్టారు. తమకు గత రెండు నెల జీతాలు రావడం లేదని.. నాలుగు నెలల పీఆర్సీ బకాయిలు, 9 నెలల ఏరియల్స్ తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. తమకు జీతాలు చెల్లించేంత వరకు ధర్నా కొనసాగుతుందని వెల్లడించారు.
దీంతో మెట్ పల్లి పట్టణంలో చెత్త ఎక్కడిక్కడ ఉండిపోయింది. చెత్త సేకరణ, పారిశుద్ధ పనులు నిలిచి.. వీధుల్లో కంపు కొడుతోంది.