కలెక్టరేట్ ఎదుట మహిళల ధర్నా

కామారెడ్డి టౌన్, వెలుగు: డ్వాక్రా సంఘాల మహిళలు చెల్లించిన  పైసలను బ్యాంక్​లో జమ చేయకుండా   సొంతానికి వాడుకున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ  మంగళవారం  కలెక్టరేట్​ ఎదుట తాడ్వాయి మండలం నందివాడ మహిళలు ధర్నా చేశారు.  ఈ సందర్భంగా వారు రూ. 36 లక్షల వరకు  బ్యాంక్​లో  జమ చేయకుండా దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఇటీవల గ్రామంలో జరిగిన  గ్రామసభలో  ఆఫీసర్ల ముందు ఇది బయట పడిందని తెలిపారు.  

పైసలు దుర్వినియోగంచేసిన  వీవోఏ బాబాగౌడ్​, సీసీ  సాయిబాబాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. వారి నుంచి అమౌంట్​ రివకరీ చేయాలని డిమాండ్​ చేశారు. అనంతరం కలెక్టర్​ను కలిసి వినతి పత్రం అందించారు.  ఎంక్వైరీ చేస్తామని ఆఫీసర్లు తెలిపారు.