తమకు ఫిజికల్ ఫిట్ నెస్ టెస్టుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ గర్భిణీ ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు నిరసన చేపట్టారు. మహిళా ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రభుత్వం ఏడు మార్కులు కలపడంతో అర్హులైన వారికి ఇయ్యాళ కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్ లు నిర్వహించనున్నారు. వీరిలో కొందరు గర్భవతులు ఉండడంతో తమను ఫిజికల్ టెస్ట్ నుంచి మినహాయించాలని కోరుతూ సుమారు 40 మంది విజ్ఞప్తి చేశారు. గర్భంతో ఉన్న వారికి ఫిజికల్ ఫిట్ నెస్ టెస్టుల నుంచి మినహాయింపు ఇవ్వాలని ట్రైనింగ్ సెంటర్ దగ్గర, రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. కాగా గర్భంతో ఉన్న వారిని నేరుగా మెయిన్స్ రాసుకునేందుకు అవకాశం ఇచ్చేలా జనవరిలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆర్డర్స్ ఏడు మార్కులు కలిపిన వారికి వర్తించవని అధికారులు చెబుతుండడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.