ఆసిఫాబాద్, వెలుగు: పెండింగ్పెట్టిన వేతనాలను వెంటనే రిలీజ్చేయాలని కోరుతూ ఎస్సీ, బీసీ హాస్టళ్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులు శుక్రవారం ఆసిఫాబాద్జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్ టీయూ రాష్ట్ర నాయకులు టి. శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలోని ఎస్సీ, బీసీ హాస్టళ్లలో పనిచేస్తున్న వాచ్మెన్, వాచ్ విమెన్, కామటీ, కుక్, స్కావెంజర్ వర్కర్లకు 11 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని వాపోయారు.
వేతనాలు ఆపి ఇబ్బందులకు గురిచేయడం కరెక్ట్కాదన్నారు. కాంగ్రెస్ప్రభుత్వం స్పందించి ప్రతినెలా 5వ తేదీ లోపు చెల్లించాలని, ఈఎస్ఐ,పీఎఫ్ సౌకర్యాలను కల్పించాలని కోరారు. హెల్త్, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ఆందోళనలో పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జగ జంపుల తిరుపతి, ఎస్సీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ జిల్లా కన్వీనర్ సత్యశ్రీ, కో కన్వీనర్ లత, కవిత, బీసీ వర్కర్స్ యూనియన్ కన్వీనర్ కొమురయ్య, కో కన్వీనర్ లక్ష్మి, సభ్యులు పాల్గొన్నారు.