భూ కబ్జాదారుల నుండి పార్కులను కాపాడాలంటూ శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం ముందు రాజేందర్ రెడ్డి నగర్ కాలనీ వాసులు ధర్నాకు దిగారు. చందానగర్ లో పార్కులు కబ్జాకు గురవుతున్నాయంటూ ఎన్నిసార్లు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే.. కబ్జాదారులు బెదిరిస్తున్నారంటూ కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని పార్కులను కాపాడాలంటూ కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.
For More News..