బాల్కొండ, వెలుగు: ప్యాకేజీ 21 ద్వారా కప్పల వాగు, పెద్దవాగుకు సాగు నీరు వదలాలని డిమాండ్ చేస్తూ గురువారం భీంగల్‌లో బీఆర్‌ఎస్ నాయకులు ధర్నా చేశారు. వాగు పరివాహక గ్రామాల రైతుల కోరిక మేరకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నీళ్లు విడుదల చేయాలని చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు.
నీటి ఎద్దడితో రెండు వాగుల వెంబడి ఉన్న గ్రామాల వరి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి విడత 10 రోజులు నీరు వదలాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.