
కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ సిటీలోని కరీమాబాద్ సెంటర్లో సీఐటీయు నాయకులు ఆదివారం బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ.. ఢిల్లీలో రైతుల గిట్టుబాటు ధర కోసం రైతులు నిరసన చేస్తుండగా.. రైతుల పోలీసులు కాల్పులు జరిపారని, కరణ్ సింగ్తో పాటు మరో ఐదుగురు రైతులు పోలీసులు కాల్పుల్లో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు నాయకులు, రైతు సంఘల నాయకులు ఉన్నారు.