నేరేడుచర్ల,వెలుగు: సాగర్ నీటిని విడుదల చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో గురువారం నేరేడుచర్ల ప్రధాన కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పొట్టదశకు వచ్చిన పంట పొలాలు ఎండిపోతున్నాయన్నారు. నీరు విడుదల చేసి పంట పొలాలని కాపాడాలని డిమాండ్ చేశారు. 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతులు బుద్ధి చెప్పే సమయం కొన్ని నెలలు మాత్రమే ఉందన్నారు. కార్యక్రమంలో తాళ్ల నరేందర్ రెడ్డి, పార్శనబోయిన సత్యం, పార్తనబోయిన విజయ్ కుమార్, సంకలమద్ది సత్యనారాయణరెడ్డి, బాల వెంకటేశ్వర్లు, గుండ్రెడ్డి విజయభాస్కర్ రెడ్డి, జూలూరి అశోక్, పల్లెపంగ వీరబాబు, కొప్పుల రాంరెడ్డి, కొణతం నాగిరెడ్డి, ఉరిమిళ్ల రామ్మూర్తి, రాజేష్ రెడ్డి , పరమేశ్వర్ రెడ్డి, తాళ్లూరి రమేశ్, మెట్టు మధు, బాలెన వెంకటకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.