
దహెగాం, వెలుగు: మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవని దహెగం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన మహిళలు స్థానిక ఎంపీడీవో ఆఫీస్ముందు ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు. 15 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని 25 కుటుంబాలున్న కాలనీలో చివరలో ఒక్క బోరు ఉండడంతో నీళ్లందడం లేదని, వేరే వాడల నుంచి బిందెలతో నీళ్లు మోసుకొని తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు తమ గోడు చెప్పుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.