సివిల్స్ లో సత్తా చాటిన యాదాద్రి భువనగిరి యువతి

సివిల్స్ లో సత్తా చాటిన యాదాద్రి భువనగిరి యువతి

యాదాద్రి భువనగిరి: సివిల్స్ ఫలితాల్లో తెలుగు వారు సత్తా చాటుతున్నారు. అధ్బుతంగా రాణిస్తూ మంచి ఫలితాలు రాబడుతున్నారు. శుక్రవారం రిలీజ్ అయిన సివిల్ సర్వీస్ 18 రిజల్ట్స్ లో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‍ మండలం గుండ్లబావికి చెందిన పెద్దిటి ధాత్రి రెడ్డి ఫస్ట్ అటెంప్ట్ లోనే 233వ ర్యాంకు సాధించింది. ఈమె ప్రస్తుతం ముంబైలో ఉద్యోగం చేస్తోంది. స్వంత ప్రిపరేషన్‍తో మొదటి ప్రయత్నంలోనే ఈ ర్యాంకు వచ్చింది.