
న్యూఢిల్లీ: టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధవన్.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఈ మేరకు బుధవారం సమావేశమైన ఫ్రాంచైజీ.. మయాంక్ అగర్వాల్‌ను తొలగించి ధవన్‌కు బాధ్యతలు అప్పగించింది. వచ్చే ఐపీఎల్‌లో ధవన్.. పంజాబ్ టీమ్‌ను నడిపించనున్నాడు. గతేడాది కేఎల్ రాహుల్ లక్నోకు వెళ్లిపోవడంతో మయాంక్‌ను కెప్టెన్సీ ఇచ్చారు. కానీ అతని సారథ్యంలో టీమ్ నిరాశ పరిచింది. బ్యాటర్‌గానూ మయాంక్ ఫెయిలయ్యాడు. గత మెగా వేలంలో ధవన్‌ను పంజాబ్ రూ. 8.25 కోట్లకు కొనుగోలు చేసింది.