‘దసరా’ చిత్రంతో తెలుగులోనూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి. ప్రస్తుతం అరజడనుకుపైగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా దీక్షిత్‌కు సంబంధించి కొత్త పోస్టర్స్‌తో బర్త్‌డే విషెస్ తెలియజేశారు ఆయా మూవీ మేకర్స్.
తను హీరోగా నటిస్తున్న తెలుగు- కన్నడ బైలింగ్వల్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంది. ఎమ్ అభిషేక్ దర్శకత్వంలో హెచ్ కె ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ‘శబర’ అనే మూవీ అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో దీక్షిత్ ఇంటెన్స్ లుక్‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు.
కిలారు ప్రేమ్ చంద్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక కెకె దర్శకత్వంలో ‘కింగ్ జాకీ క్వీన్’ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నాడు దీక్షిత్. మరోవైపు రష్మిక ఫిమేల్ లీడ్‌గా నటిస్తున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీలో తను కీ రోల్ చేస్తున్నాడు. ఈ మూవీ టీమ్ కూడా దీక్షిత్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది.