Paris Olympics 2024: అడుగు దూరంలో పతకం.. సెమీ ఫైనల్స్‌ చేరిన భారత ఆర్చరీ టీం

Paris Olympics 2024: అడుగు దూరంలో పతకం.. సెమీ ఫైనల్స్‌ చేరిన భారత ఆర్చరీ టీం

పారిస్ ఒలింపిక్స్‌లో భారత ఆర్చరీ టీం అదరగొడుతుంది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో అంకిత భకత్, ధీరజ్ బొమ్మదేవర జోడీసెమీ ఫైనల్ కు అర్హత సాధించారు. శుక్రవారం (ఆగస్ట్ 2) జరిగిన క్వార్టర్‌ఫైనల్‌లో స్పెయిన్‌కు చెందిన ఎలియా కెనాల్స్, పాబ్లో అచా గొంజాలెజ్‌లపై  విజయం సాధించి పతాకానికి అడుగు దూరంలో నిలిచారు. సెమీ ఫైనల్లో అంకిత భకత్, ధీరజ్ బొమ్మదేవర జోడీ ఇటలీ లేదా కొరియాతో తలపడనుంది.

ఈ పోటీలో భారత్ 5-3 తేడాతో విజయం సాధించారు. తొలి సెట్‌ను 38-37తో చేజిక్కించుకున్న మన జట్టు.. రెండో సెట్‌ను 38-38తో సమం చేశారు. ఆ తర్వాత మూడో సెట్‌లో స్పెయిన్‌ ఆటగాళ్లు 37-36తో విజయం సాధించారు. అయితే, చివరి సెట్‌ను 37-36తో భారత్ గెలిచి పోటీని ముగించారు. ఈ రోజు జరిగిన ప్రీ క్వార్టర్స్ లో  భారత ఆర్చరీ టీం అంకిత భకత్, ధీరజ్ బొమ్మదేవర జోడీ ఇండోనేషియా జోడీ ఆరిఫ్ పంగేస్తు, దియానందా చోయిరునిసాపై  5-1 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించారు.